శ్రేష్ఠ 1980 నుంచి 90 కాలం వరకు టాలీవుడ్ సినిమాల్లో చాలా పాత్రలు పోషించింది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలకృష్ణ చిరంజీవి, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో చిన్నగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ 100కు పైగా సినిమాల్లో మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. శ్రేష్ఠ "సమరసింహారెడ్డి" సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా, నడవలేని బాలికగా కనిపించింది. ఇదే ఆమెకు నటిగా చివరి సినిమా కావడం విశేషం. దీని తర్వాత పూర్తిగా స్టడీ పైనే ఫోకస్ చేసింది. బీ.టెక్, ఎం.టెక్ ఎమ్ఎస్ వంటి ఉన్నత చదువులను చదివింది. అమెరికాలో పెద్ద ఉద్యోగం కూడా చేసింది. అక్కడ కొన్నేళ్లు పని చేశాక మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చింది. అప్పటినుంచి తండ్రికి సంబంధించిన నిర్మాణం వ్యాపారాలను చూసుకుంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆమె లుక్కే కాస్త షాకింగ్ లాగా కనిపించింది. బొద్దుగా తయారయ్యి బాగా వయసు పైబడ్డ మహిళ లాగా కనిపించింది. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి