గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు దేవర లో కూడా తారక్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరు వారి వారి సినిమాల్లో కనిపించబోతున్నారు. ఈ రెండు మూవీల్లో తండ్రులు దగ్గరి వ్యక్తుల చేతుల్లో మోసపోవడం, వారిపై కొడుకులు పగ తీర్చుకోవడం ఉమ్మడి లక్షణంగా తెలుస్తోంది. దీన్ని బట్టే రెండు సినిమాల మధ్యలో పోలికలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే గేమ్ ఛేంజర్ పూర్తిగా పొలిటికల్ డ్రామా. ఇక దేవర విషయానికి వస్తే.. పూర్తిగా యాక్షన్ మూవీ. వేటికవే సెపరేట్.ఇదిలా ఉండగా.. తండ్రీని మోసం చేసిన విలన్స్ పై కొడుకులు పగ తీర్చుకోవడం అన్నది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. కానీ దానిని స్క్రీన్ పై డైరెక్టర్ ఎలా ప్రజెంట్ చేశాడు అన్నదే ఇక్కడ కీలకాంశం. ఇప్పుడు దేవర-గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు ఒకే సెటప్పులో వస్తున్నాయని కొందరు పేర్కొంటున్నారు. కాగా.. దేవర రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు. మరి రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయి అంటూ వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి