
అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి కూడా ఎన్నో సినిమాస్లో నటించి మెప్పించాడు. అందులో ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో వచ్చిన 'పెద్ద రాయుడు' సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలోని పాటలు, ఎమోషనల్ సీన్స్, కామెడీ ఇలా అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించగా..మోహన్ బాబు మాత్రం డ్యూయర్ రోల్ లో మెప్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తన తండ్రి దగ్గరకు వచ్చే సీన్ బాగా పండింది. అయితే ఆ సీన్ లో బ్రహ్మానందం భార్యగా నటించిన నటి మరెవరో కాదు. జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. ఈమె పెద్ద రాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాల్లోనూ నటించింది. ఇక కూతురు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఆమె సినిమాలు మానేసింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సత్య శ్రీ తెలిపింది. ఇక సత్య శ్రీ విషయానికి వస్తే..జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.