పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఉప్పెన అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పంజా వైష్ణవ్ తేజ్మూవీ తోనే హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక కృతి శెట్టి కూడా ఈ సినిమా తోనే తెలుగు తెరకు పరిచయం అయింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దగ్గర ఎన్నో సినిమాలకు పని చేసిన బుచ్చిబాబు కూడా ఈ సినిమాతోనే దర్శకుడిగా కొరియర్ను మొదలు పెట్టాడు.

మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2021 వ సంవత్సరం ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ లోని నటనకు గాను వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి కి అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే మొదటి సినిమా అయినప్పటికీ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు గాను బుచ్చిబాబు కు దర్శకుడిగా కూడా అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లలో జాతీయ ఉత్తమ తెలుగు సినిమా విభాగంలో అవార్డ్ వచ్చింది. ఇలా కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: