యూత్ ని ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలలో కొత్త బంగారులోకం సినిమా ఒకటి. వరుణ్ సందేశ్ హీరోగా శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ హీరో తల్లి పాత్రలో నటించింది.టీనేజ్ లో ప్రేమ పుట్టడం ఆ తర్వాత వారి మధ్య గ్యాప్ రావడం లేచిపోవడం ఇలా ఎన్నో సీన్స్ ఈ సినిమాలో మనకు చూపించారు. అంతేకాదు ఒక యువకుడు ప్రేమించిన అమ్మాయికి దూరమై తల్లి కోసం తండ్రి కోసం తన గోల్ ఎలా రీచ్ అవుతాడు అనేది ఈ సినిమాలో చూపించారు.అయితే ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోయారు హీరో హీరోయిన్. అయితే ఈ సినిమాలో నటించిన శ్వేతా బసు ప్రసాద్ స్టార్ అవ్వడమే కాదు వ్యభిచారం కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. 

ఈ వ్యభిచార కేసు ఆరోపణ తర్వాత టాలీవుడ్ లో ఈమెకు బొత్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు ప్రసాద్ ఇండస్ట్రీలో ఓ హీరో గురించి సంచలన కామెంట్లు చేసింది.శ్వేతా బసు ప్రసాద్ మాట్లాడుతూ.. నేను ఓ తెలుగు హీరోతో సినిమా చేసిన సమయంలో చాలా టార్చర్ అనుభవించాను.ఆ హీరో తో పాటు సినిమా షూటింగ్ సెట్లో ఉన్నవాళ్లందరూ నేను ఎత్తు తక్కువగా ఉన్నానని,పొట్టిగా ఉన్నానని చాలాసార్లు వ్యంగ్యంగా మాట్లాడారు.. సినిమా సెట్లో ఉన్న వారే అనుకుంటే ఆ హీరో కూడా నన్ను చాలాసార్లు అవమానించాడు.

ఇక ఆ హీరో తెలుగు వాడే అయినప్పటికీ డైలాగ్ చెప్పడానికి చాలా టేక్స్ తీసుకునేవాడు.నేను మాత్రం ఏ డైలాగ్ నైనా సరే చాలా క్లియర్ గా చెప్పేదాన్ని. కానీ ఆ హీరో తెలుగువాడైనా అలా చేశాడు.ఇక హీరో ఎత్తు 6 ఫీట్స్ ఉంటాయి. నా ఎత్తు 5.2.. అయినా కూడా నేను పొట్టిగా ఉన్నట్లు వ్యంగంగా నన్ను ఉద్దేశించి మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెట్టాడు అంటూ శ్వేతా బసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు చెప్పకుండా పరోక్షంగా ఆ హీరో పై కామెంట్స్ చేయడంతో శ్వేతా బసు ప్రసాద్ ని టార్చర్ చేసిన ఆ హీరో ఎవరా అంటూ వెతికే పనిలో పడ్డారు నెటిజెన్స్

మరింత సమాచారం తెలుసుకోండి: