తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఎంతో కష్టపడి షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ ఆఫర్ల కోసం ఎదురుచూసి చివరికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి గుర్తింపు సాధించారు. అలాంటి రాజ్ తరుణ్  ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా  తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఈ ఒక్క సినిమానే తనకు టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో తనకు జోడిగా నచించిన హీరోయిన్ అవికాగోరు మరింత ప్లస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. ఆమె చిన్నారి పెళ్ళికూతురుగా దేశమంతా పరిచయమైంది. ఇలా ఉయ్యాల జంపాల సూపర్ హిట్ అవ్వడంతో సినిమా చూపిస్త మావ అనే సినిమా ఆఫర్ వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ కావడంతో, రాజ్ తరుణ్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. 

ఆ తర్వాత కుమారి 21ఎఫ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టడంతో ఇక వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఆడోరకం ఈడోరకం, అనుభవించు రాజా, ఇలా పలు చిత్రాలు చేసి హిట్ ఫ్లాపు అనే తేడా లేకుండా దూసుకెళ్లారు. అలాంటి రాజ్ తరుణ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తరుణంలో లావణ్య అనే అమ్మాయి వివాదంతో ఇబ్బందుల పాలవుతున్నాడు. ఇలా సాగుతున్న రాజ్  జీవితంలో మరపురాని చీకటి రోజులు ఉన్నాయట. ఆ ఇబ్బంది వల్ల ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారట. మరి ఆ ఇబ్బందులు ఏంటో చూద్దాం.

 ఇండియాలో కరోనా లాక్ డౌన్ విధించిన  సమయంలో రాజ్ తరుణ్ కుటుంబమంతా గోవాలో ఉందట. అక్కడ వాళ్ళు ఉండగానే లాక్ డౌన్ పడడంతో వాళ్లు ఇక్కడికి రావడానికి చాలా సమయం పట్టింది. దీంతో రాజ్ తరుణ్ ఇంటికి పరిమితమయ్యారు. ఎవరు మాట్లాడడానికి లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఫీల్ అయిపోయి చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్పారట. వెంటనే మధు నందన్ స్పందించి ఎలాగోలా రాజ్ తరుణ్ ఆ ఇంట్లో నుంచి తన ఇంటికి తీసుకొచ్చారట. ఆత్మహత్య అనే ఫీలింగ్ నుంచి బయటపడేసానని చెప్పారు. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: