నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితం నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ నాని కెరియర్లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నాని కి ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాని నటించిన హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలను కూడా పాన్ ఇండియా మూవీలుగా విడుదల చేశారు.

ఈ మూవీలు కూడా మంచి విజయాలు సాధించడంతో నాని క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగింది. ఇలా వరుసగా మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకొని ఫుల్ జోష్లో ఉన్న నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఎ" సర్టిఫికెట్ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ 2 గంటల 37 నిమిషాల 6 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా రన్ టైమ్ కాస్త ఎక్కువ గానే ఉంది అని , మూవీ ఎక్కడ కాస్త ట్రాక్ తప్పిన ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక సినిమా ఎక్కడైనా కాస్త ట్రాక్ తప్పిన కూడా జనాలు దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నాని ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: