
టాలీవుడ్ లో ఈ ఎడాది ఏప్రిల్ కూడా నెగిటివ్ సెంటిమెంట్ ను కొనసాగించింది. గత ఐదేళ్లుగా చూసుకుంటే ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమాలలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష తప్ప ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతూ ఉన్నాయి. గని - ఆచార్య - వకీల్ సాబ్ - వైల్డ్ డాగ్ - ఏజెంట్ - శాకుంతలం - రావణాసుర - ఫ్యామిలీ స్టార్ ఇలా గత కొన్ని నెలలు ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమాలేవి ఆడలేదు. ఇప్పుడు ఇదే నెగిటివ్ సెంటిమెంట్ ను ఈ యేడాది ఏప్రిల్ నెల కూడా కొనసాగించింది. ఈ ఏప్రిల్ నెలలో కూడా ఓ మోస్తరు అంచనాలతో కొన్ని సినిమాలు వచ్చాయి సిద్దు జొన్నలగడ్డ కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలు వచ్చిన ఏ ఒక్కటి థియేటర్లలో నిలబడలేకపోయింది. ఇక జాక్ సినిమా గురించి చెప్పుకుంటే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు రీ షూట్ వల్ల అనుకున్న బడ్జెట్ కంటే 30% ఎక్కువ అయింది.
18 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన ఈ సినిమా వారం దాటేసరికి ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల రూపాయల గ్రాస్ కూడా రాబట్టలేక చతికిల పడింది ... అంటే ఈ లెక్కన ఈ సినిమాకు 13 కోట్లకు పైగా భారీ నష్టాలు మిగిల్చినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. ఇక కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు మంచి టాక్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు 13 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు. నాలుగో రోజుకి అందరూ సైలెంట్ అయ్యారు. బ్రేక్ ఈవెన్ కు దరిదాపులకు కూడా ఈ సినిమా వెళ్లకుండానే థియేటర్ దాదాపు క్లోజ్ చేసుకుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు