- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం మన తెలుగు సినిమా దగ్గర స‌మ్మ‌ర్ లో స‌రైన సినిమా లేద‌ని అంద‌రూ నిరాశ‌లో ఉన్న టైంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ 3. కేవ‌లం రెండు రోజుల‌కే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమా ఏకంగా రు. 62 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టింది. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మోస్ట్ ప్రామిసింగ్ .. ప్రాఫిట‌బుల్ హీరో ఎవ‌రైనా ఉన్నారా అంటే అది నేచుర‌ల్ స్టార్ నానీయే అని చెప్పాలి. థియేట్రికల్ నుంచి నాన్ థియేట్రికల్ వరకు సినిమా ఇంకా మొదలు కాకుండానే లాభాలు అందించే స్థిరమైన హీరోగా నాని మన టాలీవుడ్ లో ఇపుడు దూసుకు పోతున్నాడు. ఇక కేవ‌లం ఏపీ, తెలంగాణ లో నే కాకుండా అటు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఇదే తరహా నిలకడని ఓ హీరో కొనసాగించడం అనేది ట్రేడ్ వ‌ర్గాల్లో చాలా గొప్ప విష‌యం అని చెప్పాలి.


అస‌లు నాని ఓవ‌ర్సీస్ లో వీర విహార‌మే చేస్తున్నాడు. మ‌నోడి ఓవర్సీస్ మార్కెట్ స్టామినా ఏ రేంజ్ లో ఉందంటే నార్త్ అమెరికాలో ఏకంగా తన ఖాతాలో 1 మిలియన్ డాలర్స్ సాధించిన సినిమాలు ఒక‌టి రెండు కాదు ఏకంగా 11 ఉన్నాయి. తెలుగులో ఇన్ని ఎక్కువ సినిమా లు ఉన్న హీరో టాప్ స్టార్ .. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. మ‌హేష్ బాబు 12 సినిమాలతో మొదటి స్థానంలో ఉంటే తన తర్వాత ఉన్న ఏకైక హీరోగా నాని ఉన్నాడు. అలాగే  1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకున్న హీరోస్ లో టాప్ 5 లో నాని ఒక‌డి గా ఉండ‌డం విశేషం. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ ల తర్వాత వన్ అండ్ ఓన్లీ హీరోగా నాని యునాన‌మ‌స్ స్టామినా తో దూసుకు పోతుండ‌డం విశేషం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: