
టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా సినిమాలు రిలీజ్ డేట్ వాయిదా వేసుకుని సరికొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా ఉంది. ఈ ప్రెస్టేజ్ సినిమాని బింబిసార దర్శకుడు మళ్ళి వశిష్ట తెరకెక్కిస్తుండగా జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ అయినవేళ మరోసారి చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో అంచనాలు మామూలుగా లేవు. అయితే జూలై 4న విశ్వంభర సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ కు ఇబ్బందిగా మారింది. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా ను ఇప్పటికే జూలై 4న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ప్రమోషన్లు కూడా షురూ చేశారు. మరి డిసెంబర్ సినిమాను జూలై 4న రిలీజ్ చేస్తే తమ్ముడు పరిస్థితి ఏంటి అన్నది ? ఎవరికీ అర్థం కావడం లేదు. అసలే నితిన్ కు సరైన హిట్లు లేవు.. ఈ టైంలో నితిన్ సోలోగా ప్రేక్షకులు ముందుకు రావాలంటే అదే రోజు చిరు విశ్వంభర సినిమా కూడా వస్తే నితిన్ తమ్ముడు సినిమాకు కష్టాలు తప్పవని చర్చలు నడుస్తున్నాయి. టాలీవుడ్‌లో ఈ పరిస్థితి ఎందుకొస్తుందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు