
నందమూరి ఫ్యాన్స్ కి ఇవాళ్ళ ట్రిపుల్ ధమాకా రాబోతుంది. మూడు సినిమాల కి సంబంధించిన అప్ డేట్స్ రాబోతున్నాయ్. కాగా జూనియర్ ఎన్టీఆర్ డైలీ షెడ్యూల్ ఒకలా ఉంటుంది . ఉదయం లేవడం యోగ చేయడం డైట్ ఫాలో అవ్వడం తన కాల్ షీట్స్ ప్రకారం షూటింగ్స్ కి వెళ్ళడం ఇలానే ఉంటుంది . కానీ తారక్ మాత్రం తన ప్రతి రోజు ఎంత బిజీగా ఉన్నా కొన్ని కొన్ని పనులు మరిచిపోయిన తన పుట్టినరోజుకు మాత్రం ఒక పని కచ్చితంగా చేస్తాడు. మరీ ముఖ్యంగా తన తండ్రి హరికృష్ణ చనిపోయినప్పటి నుంచి ఆ పని తన ప్రతి పుట్టినరోజుకి చేస్తూ వస్తున్నాడు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతుంది. హరికృష్ణ రోడ్డూ యాక్సిడెంట్లో చనిపోయాడు . ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ పడిన బాధ ఎవరు తీర్చలేనిది . ఇప్పటికి ఆ విజువల్స్ సోషల్ మీడియాలో చూస్తే కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ లైఫ్ లో తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేనిది . జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత నుండి వచ్చిన ప్రతి పుట్టినరోజు నాడు అన్నిటికన్నా ముందు హరికృష్ణ ఫోటో దగ్గరకు వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటారట. ఆ తర్వాత తన తల్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటారట . ఆ తర్వాతే సీనియర్ ఎన్టీ రామారావు గారి ఫోటో వద్దకు వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటారట.
జూనియర్ ఎన్టీఆర్ కి తన నాన్న అంటే చాలా చాలా ఇష్టం . చాలా సందర్భాలలో ఆ విషయాన్ని బయటపెట్టేసాడు . జూనియర్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన పుట్టినరోజు నాడు మాత్రం హరికృష్ణ ఫోటో వద్దకు వెళ్లి తన బాధను తన ఎమోషన్ ని పంచుకుంటూ ఉంటారట. తన నాన్న ఈ లోకంలో లేకపోయినా తన నాన్న తన మనసులోనే ఉన్నాడు అన్న ఫీలింగ్ తో తారక్ తన ప్రతి పుట్టినరోజుకు హరికృష్ణ ఫోటో వద్దకు వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటారట. కాగా తారక్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . ఈరోజు వార్ 2 సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ . ఈ అప్డేట్ చూశాక నందమూరి ఫ్యాన్స్ కి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు..!