
దీంతో మల్టీ టాస్కింగ్ ఉమెన్ నయనతార అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు . కేవలం ఆ సీన్ మాత్రమే కాదు ఆ వీడియోలో నయన్ చాలా చాలా నాచురల్ గా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నడిచింది . నయనతార ఎలాంటి గ్లామర్ లుక్ లో లేకుండా కేవలం పిల్లలను ఆడిస్తూ అలసిపోయినట్లు ఆ వీడియోలో కనపడుతుంది . "అంతేనా 40 వేల అడుగుల ఎత్తులో ఇంటి నుంచి తెచ్చిన బిర్యాని నాటుకోడి లైఫ్ ని మరింత స్పెషల్ చేస్తూ ఎంజాయ్ చేసే విధంగా మార్చేసింది.. ఇది తమ వెకేషన్ టైం" అంటూ వీడియోను నయనతార పోస్ట్ చేసింది.
అదే వీడియోని విగ్నేశ్ శివన్ కూడా షేర్ చేశాడు . ఈ వీడియో నయన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . మామూలుగా నయన్-విగ్నేశ్ వెకేషన్ కి వెళ్తే అక్కడి నుంచి ఫోటోలు షేర్ చేస్తారు. కానీ ఈసారి ఫ్లైట్ వీడియో కూడా షేర్ చేశారు . ప్యారెంటింగ్ అనేది ఎవరికైనా కష్టమే కానీ ఇష్టంగా చేస్తే ఏదీ కష్టం కాదు అంటూ ప్రూవ్ చేసింది నయనతార . నయనతార తన పిల్లలతో గడుపుతున్న పిక్స్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొందరు నయనతారను తెగ పోగిడేస్తున్నారు . నయనతార పిల్లల్ని హ్యాండిల్ చేసే పద్ధతి చాలా బాగుంది అని ఒక హీరోయిన్ ఇంత ఓపికగా పిల్లల్ని ఆడిస్తుంది అంటే నిజంగా ఆమె గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. నయన్..చిరు-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది..!