తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈ హీరో తనదైన నటన, సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారారు. ఈ సినిమా అనంతరం పుష్ప-2 సినిమాలో నటించగా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఏకంగా అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. పుష్ప-2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను అట్లీతో తీయనున్నారు. "AA 22" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్ గత కొద్ది రోజుల నుంచి ఏమి చేసినా అది వైరల్ గానే మారుతుంది. 

తాను మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి వైరల్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ హీరోకి అదృష్టం పెద్దగా కలిసి రావడం లేదు. అల్లు అర్జున్ గతంలో తన మామ మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో నేను కేవలం మా మామయ్యను మాత్రమే చూసానని తన పక్కన హీరోయిన్ కూడా ఉందని చెబితే నేను లేదని అన్నాను. ఆ సినిమాను నేను 17 సార్లు చూసాను. వేరే వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అక్కడ హీరోయిన్ కనిపించిందని అల్లు అర్జున్ అన్నారు.

అయితే కొంతమంది అల్లు అర్జున్ అంటే పడని వాళ్ళు ఈ వీడియోని వాడుకొని కియారా అద్వానీకి సంబంధించిన ఓ ఫోటోను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్-2 సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. అందులో కియారా అద్వానీ బికినీ ధరించిన షాట్ టీజర్ లో కనిపించింది. ఈ ఫోటోని ప్రస్తుతం సోషల్ మీడియాలోని మీమర్స్ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోకు అల్లు అర్జున్ మాట్లాడిన ఈ మాటలను కనెక్ట్ చేస్తూ ఓ వీడియోను క్రియేట్ చేయడంతో కొంతమంది అభిమానులు సీరియస్ అవుతున్నారు. దీనిపై కియారా అద్వాని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: