
నిన్నటి రోజున జనసేన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ చేత థియేటర్ల పైన విచారణ చేయాలి అంటూ ఆదేశాలను కూడా జారీ చేయించేలా చేశారు. అయితే అదే రోజున తన కార్యాలయం నుంచే పవన్ కళ్యాణ్ ఒక హెచ్చరికతో కూడిన ప్రకటన కూడా చేయించినట్లు తెలుస్తోంది. గతంలో అశ్వని దత్, అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ ఎర్ని తదితరులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు.. కానీ అప్పట్లో అందరిని రమ్మంటే ఎవరూ రాలేదని? దీంతో తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.
కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఏడాది అవుతున్న ఇప్పటివరకు సినిమా సంఘాలు ఎవరూ కూడా తమని కలవలేదని.. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం కోసం కలుస్తున్నారు .. ఇకమీదట సినిమా వ్యక్తులతో ఎలాంటి చర్చలు జరిపేవి ఉండవని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్..వ్యక్తిగతంగా సినిమా టికెట్లు పెంచమని కోరడం ఎందుకు అందరిని కలిసి రమ్మంటే ఎవరు రారు కదా?.. ఇది తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాకు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.. ఈ రిటర్న్ గిఫ్ట్ కు తగ్గట్టుగానే మేము కూడా పనిచేస్తామంటూ ఫైర్ అయ్యారు.
అందుకే సినిమా థియేటర్లు ఆదాయం పైన కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నామని.. అందులో థియేటర్ల యాజమాన్యం థియేటర్లను నడపలేదని లీజు దారులు ఎక్కువగా థియేటర్లను నడిపిస్తున్నారని తేలింది.. అలాంటి లీజు దారులు దగ్గర నుంచి అసలు పన్ను వస్తుందా లేదా అని కూడా తాము పరిశీలిస్తున్నామని.. థియేటర్లలో కూల్ డ్రింక్స్, స్నాక్స్ లాంటి ధరల పైన కూడా తనిఖీ చేస్తాం థియేటర్లను తనిఖీ చేయడానికి ప్రత్యేకమైన బృందాలను కూడా పంపిస్తామని ఇకమీదట అన్ని విషయాల పైన విచారణ జరుపుతామంటూ పవన్ కళ్యాణ్ నుండి ఒక ప్రకటన వెలువడిందట. దీంతో వైసిపి సోషల్ మీడియాలో అటు పత్రికలలో కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ పైన "వీర ముల్లు" బెదిరింపులు అంటూ వైరల్ గా చేస్తున్నారు.