టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో అడవి శేషు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఈయనకు క్షణం మూవీతో అద్భుతమైన విజయం మంచి గుర్తింపు దక్కాయి. ఆ తర్వాత నుండి ఈయన నటించిన చాలా సినిమాలు వరుస పెట్టి అద్భుతమైన విజయను అందుకుంటూ వస్తున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం అడవి శేషు "మేజర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించారు.

మూవీ కి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా ... ఈ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించాడు. వరుస విజయాలతో ఉన్న అడవి శేషు ఈ మూవీ లో హీరోగా నటించడం , ఆ సినిమా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందడం , ఈ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2022 వ సంవత్సరం జూన్ 3 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 19 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.

మూవీ మొత్తం 33.35 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ 14.35 లాభాలను అందుకుంది. ఇలా మహేష్ బాబు కు ఈ మూవీ ద్వారా మంచి లాభాలు రావడం మాత్రమే కాకుండా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఒక అద్భుతమైన సినిమాను రూపొందించినందుకుగాను ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb