ఏంటి జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ కంటే ముందే మరో హీరోని పెళ్లి చేసుకుందా.. పెళ్లి ఫోటోలు కూడా దిగారుగా.. ఇంతకీ జెనీలియా రితేష్ కంటే ముందు పెళ్లి చేసుకున్న ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. జెనీలియా మాజీ సీఎం మనవడు అయినటువంటి రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక రాజకీయ నేపథ్యంతో పాటు సినీ నేపథ్యంలో కూడా పెరిగారు. అలా రితేజ్ దేశ్ ముఖ్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. అలా సినిమాలు చేస్తున్న క్రమంలోనే జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. అలా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.ఇక ఈ అన్యోన్యమైన దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. 

అలాగే జెనీలియాని తన భర్త చాలా ప్రేమిస్తారు.తనపై ఎప్పటికప్పుడు ప్రేమని కురిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు అంటే రీతేష్ దేశ్ ముఖ్ కి చెప్పలేనంత గౌరవం.ఓ అవార్డ్స్ ఈవెంట్లో జెనీలియా చేతుల మీదుగా అవార్డు అందుకొని ఆమె కాళ్లు తాకపోయాడు అంటే జెనీలియా మీద రితేష్ దేశ్ముఖ్ కి ఎలాంటి అభిప్రాయం గౌరవం ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ల గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే..జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ అంటే ముందే హీరో జాన్ అబ్రహం ని పెళ్లి చేసుకుందని, ఫోటోలు కూడా ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత 14 సంవత్సరాల క్రితం ఈ వార్త తెగ వైరల్ అయింది.

తాజాగా ఈ వార్తపై క్లారిటీ ఇచ్చింది జెనీలియా. గతంలో జెనీలియా జాన్ అబ్రహం కలిసి ఉన్న ఒక పెళ్లి ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టింది.అయితే వీరిద్దరూ కలిసి ఫోర్స్ అనే సినిమాలో షూటింగ్లో భాగంగా జెనీలియా జాన్ అబ్రహం ల పెళ్లి జరగాల్సి ఉంటుంది.అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో చక్కర్లు కొట్టడంతో ఒక రూమర్ వైరల్ అయింది. అదేంటంటే ఫోర్స్ సినిమాలో భాగంగా పంతులు సినిమా షూట్ కోసం పెళ్లి చేయమంటే నిజంగానే జెనీలియా జాన్ అబ్రహంలకు పెళ్లి చేశారని,వీరిద్దరూ సాంప్రదాయబద్ధంగా భార్యాభర్తలు అయ్యారు అంటూ ఒక రూమర్ ప్రచారం చేశారు. అయితే చాలా రోజులు ఈ రూమర్ వైరల్ అయినప్పటికీ జాన్ అబ్రహం గానీ జెనీలియా గానీ పట్టించుకోలేదు.

అయితే 14 ఏళ్ల తర్వాత తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది జెనీలియా  జాన్ అబ్రహంతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ. నేను జాన్ ఇద్దరం ఓ సినిమా షూటింగ్లో భాగంగా అలా పెళ్లి సీన్ చేయాల్సి వచ్చింది. అయితే కొంతమంది పంతులుగారు మాకు నిజంగానే పెళ్లి చేసేసారు అంటూ మాట్లాడుకున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.అది కేవలం సినిమా షూట్ కోసం మాత్రమే నటించాము. కొంతమంది పిఆర్ లు కావాలనే ఈ ప్రచారాన్ని చేశారు.కనుక ఇలాంటి గాసిప్ వార్తలను ఎందుకు ప్రచారం చేశారని అలాంటి పిఆర్ లనే అడగండి అంటూ తాజా ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది జెనీలియా

మరింత సమాచారం తెలుసుకోండి: