మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` ఫైనల్ గా విడుదలకు సిద్ధమయింది. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఎందరో భాగమైన కన్నప్ప జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. సినిమాను ప్రమోట్ చేయడంలో మంచు విష్ణు చాలా ఎక్కువే కష్టపడ్డాడు. రెండు పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు.


ఇవన్నీ ఒక ఎత్తయితే..  కన్నప్పకు అసలుసిసలైన హైప్ తీసుకువచ్చింది ప్రభాసే. కన్నప్ప సెకండ్ హాఫ్ లో ఒక కీలకమైన క్యామియో రోల్ ప్రభాస్ పోషించడంతో కన్నప్ప పై విపరీతమైన పబ్లిసిటీ ఏర్పడింది. నిజానికి ఈ సినిమాలో మెయిన్ హీరో మంచు విష్ణు అయినప్పటికీ.. అందరి ఫోకస్ ప్రభాస్ పైనే ఉంది. అయితే కన్నప్ప ప్రమోషన్స్ కు ప్రభాస్ దూరంగా ఉండటం చాలామందిని నిరాశపరిచింది. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ప్రభాస్ హాజరు కాలేదు.


సోషల్ మీడియా తప్ప నేరుగా కన్నప్పను ప్రభాస్ ఇంతవరకు ప్రమోట్ చేయలేదు. అయితే ప్రభాస్ సైలెన్స్ వెనుక రీజన్ ఉందట. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ కారణంగానే కన్నప్పలో యాక్ట్ చేస్తాను కానీ ప్రమోషన్స్ కు మాత్రం రానని మేకర్స్ కు ముందే చెప్పేసాడట ప్రభాస్. క్యామియో చేయడమే గొప్ప అనుకున్న మేకర్స్ అందుకు సరే అన్నారట. ఇదంతా బాగానే ఉన్నా ప్రభాస్ డైరెక్ట్‌గా ప్రమోషన్స్ లో పాల్గొని ఉండుంటే కన్నప్పపై హైప్ నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్న‌ట్లు ఈ సినిమాలో న‌టించినందుకు గానూ ప్ర‌భాస్ పైసా రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకోక‌పోవ‌డం విశేషం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: