చాలామంది సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకోవడానికి పాపులారిటీ పెంచుకోవడానికి తమకున్న స్టార్ స్టేటస్ ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు.  కొంతమంది స్టార్ స్టేటస్ ఉన్నా సరే తమ పర్సనల్ లైఫ్ ని చాలా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు . ఎక్కడ కూడా తమ గొప్పలను చెప్పుకోవడానికి ఇష్టపడరు . అసలు కొంతమంది స్టార్స్ భార్యలు ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ అయినా ఇప్పుడు చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు . అలాంటి వాళ్ళల్లో ఒకరే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక యాంకర్ . ఆమె మరి ఎవరో కాదు "యాంకర్ జాహ్నవి".


యాంకర్ జాహ్నవి ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ భార్య.  గాయం ,చిత్రం ,నువ్వు నేను,  గులాబీ , కిక్ లాంటి ఎన్నో చిత్రాలకు సినిమా అందరికీ సుపరిచితుడే.  అంతేకాదు ఒకరికి ఒకరు , సంఘం,  భగీరథ చిత్రాలను డైరెక్ట్ కూడా చేశారు . ఒకరికొకరు సినిమా చేస్తున్న మూమెంట్ లోనే ఆయన ఆ సినిమాల్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ లో నటిస్తున్న స్టార్ యాంకర్ తో ప్రేమాయణం కొనసాగించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు . హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది . రీసెంట్గా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయట పెట్టాడు . ఆయన బయటపెట్టే వరకు కూడా ఆ యాంకర్ ఈయన భార్య అని చాలా మందికి తెలియదు . ఇంతకీ ఆయనకు ఎవరో తెలుసా..? "జాహ్నవి"..



అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాహ్నవి . జాహ్నవి "యజ్ఞం", "హ్యాపీ" చిత్రాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించారు . మరీ ముఖ్యంగా ఆమెకు హ్యాపీ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది . అదేవిధంగా యజ్ఞం సినిమాలో ఆమె మాట్లాడిన మాటలు డైలాగ్స్ బాగా హైలైట్ అయ్యాయి . అల్లు అర్జున్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన హ్యాపీ సినిమాలో జెనీలియా ఫ్రెండ్ గ్రూప్ లో ఒకరిగా నటిస్తుంది జాహ్నవి.  అల్లు అర్జున్ - జాహ్నవి మధ్య వచ్చే సీన్స్ కూడా అప్పట్లో హైలైట్ గా మారాయి.  చాలా మంది బన్నీ మరదల పిల్ల అంటూ కూడా అప్పట్లో మాట్లాదుకున్నారు.  



అంతేకాదు యాంకరింగ్ కూడా చక్కగా చేస్తుంది జాహ్నవి.  ఆమె చేసిన ఎన్నో షోలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాగా ఒకరికి ఒకరు సినిమా చేస్తున్న మూమెంట్లో సినిమా ఆటోగ్రాఫర్ రసూల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న జాహ్నవి ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది . రసూల్ ఈ విషయాన్ని బయట పెట్టాడు . సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి పెద్ద రీజన్స్ ఏమీ లేవు అని .. ఇద్దరం మాట్లాడుకొని ఇలా దూరంగా ఉండిపోయింది అని చెప్పుకొచ్చారు.  రసూల్ సినిమా ఆటోగ్రాఫర్ గా ఫ్యామిలీ సర్కస్ , లిటిల్ సోల్జర్స్ , వాంటెడ్ , జల్సా , ఏజెంట్ , ఊసరవెల్లి , ఇలా ఎన్నో చిత్రాలు చేశారు.  ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.  ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . అంత స్టార్ స్టేటస్ ఉండి కూడా ఇంత సింపుల్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నారా..? మీరు నిజంగా గ్రేట్ అంటున్నారు. అంతేకాదు జాహ్నవి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: