మ్యాన్ ఆఫ్ మ‌సెస్ ఎన్టీఆర్ ఇప్పుడు హీరో గానే కాకుండా యాంటీ హీరో గా కూడా నటిస్తున్న విషయం తెలిసింది .. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తో చేస్తున్న భారీ యాక్షన్ మూవీ వార్ 2 .. హృతిక్ రోషన్ తో సహా ఎన్టీఆర్ సాలిడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు .. అయితే ఈ సినిమా లో ఇది వరకే వచ్చిన టీజర్ తో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు అనే దాని పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. .

ఎన్టీఆర్ కూడా ఈ సినిమా లో స్పై ఏజెంట్ గా తాను ఇండియా తరఫు నుంచి దారి తప్పిన కబీర్ (హృతిక్ రోషన్) నీ ఎదుర్కొనే తనకి సమానమైన స్టామినా కలిగిన పవర్ఫుల్ ఏజెంట్ విక్రమ్ గా కనిపించబోతున్నాడట .. అయితే ఇదివరకు ఎన్టీఆర్ ఏజెంట్ వీరేంద్ర రఘునాథ్ గా కనిపిస్తాడని టాక్ వచ్చింది .. కానీ ఇప్పుడు విక్రమ్ గా అది మారింది .. అయితే ఇది ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని కూడా అంటున్నారు .. ఇక మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది .. ఇక మరి ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా .. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు .. అలాగే వార్ 2 తెలుగు సినిమా హక్కులను తెలుగు యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ 80 కోట్లకు దక్కించుకున్నారు .. ఇక మరి రిలీజ్ తర్వాత వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: