- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ల‌లో మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా ఒక‌టి. ఈ సినిమా మ‌హేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా తెర‌కెక్కుతోంది. త్రిబుల్ ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే కావ‌డం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌తో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి అధికారికంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. అయితే ఈ సినిమా గురించి ఇప్ప‌టికే ఓ క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.


ఇంకా షూటింగ్ ద‌శ లో ఉండ‌గానే ఈ సినిమా కు అదిరిపోయే బిజినెస్ డీల్స్ వ‌స్తున్నాయ‌ట‌. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు స‌మాచారం. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు జ‌ర‌గ‌ని విధంగా భారీ రేటు చెల్లించి ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వ‌ర‌లో నే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట‌. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: