సుకుమార్ ఈయన ఎంత బాగా సినిమాలను తెరకెక్కిస్తాడు అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేదు.  తన సినిమాలో హీరో కోసం మరొక క్యారెక్టర్ ని బలి చేస్తూనే ఉంటాడు . ఇది ఇప్పటి మాట కాదు ఎప్పటినుంచో వస్తున్న మాట . ఆర్య సినిమాలో బన్నీ కోసం శివబాలాజీ ని ఎలా బకరాని చేసారో.. ఆ తర్వాత 100% లవ్ సినిమాలో నాగచైతన్య కోసం నందు క్యారెక్టర్ ని ఎలా బకరా చేశారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ హైలెట్ అవ్వడం కోసం ఆది పినిశెట్టి క్యారెక్టర్ ని ఎంత లో చేశాడో అంటూ కూడా అప్పట్లో టాక్ వినిపించింది.


కానీ ఇలాంటివి ఏమి పెద్దగా సుకుమార్ పట్టించుకోలేదు. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టే ముందుకు వెళ్ళిపోతూ వచ్చారు. అయితే ఇప్పుడు మరొకసారి అలాంటి పని చేయబోతున్నాడు సుకుమార్ అన్న వార్త సినిమా సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది.  త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు . ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ హైలైట్ అవ్వడానికి మరొక పాత్రని బకరాగా చేయబోతున్నారట సుకుమార్.  రంగస్థలం సినిమాలో చరణ్ క్యారెక్టర్ హైలెట్ చేయడానికి ఆదీపినిశెట్టి ని  ఎలా వాడుకున్నారో సేమ్ ఈ ప్రాజెక్టులో కూడా చరణ్ హైలెట్ చేయడానికి మరొక హీరోని వాడుకోబోతున్నారట .



హీరో మరెవరో కాదు శర్వానంద్. చరణ్ - శర్వానంద్ ఎంత జాన్ జిగిడి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలుసు . చరణ్ మీద ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఈ ప్రాజెక్టును ఓకే చేసేసారట శర్వానంద్ .  ఆ కారణంగా కూడా ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అంటున్నారు జనాలు. మొత్తానికి సుకుమార్ ఇప్పుడు చరణ్ కోసం శర్వానంద్ ని బకర  చేయడానికి సిద్ధమయ్యాడు అంటూ ఘాటుగా మాట్లాడుకుంటున్నారు జనాలు.  దీనిపై అఫీషియల్ ప్రకటన లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అయిపోతున్నాయి ఈ వార్తలు.  చూడాలి మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుంది అనేది...??

మరింత సమాచారం తెలుసుకోండి: