టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల లో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భం గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది . ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయి న్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించా డు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడంతో వెంకటేష్ తన తదుపరి మూవీ లు ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి జనాల్లో భారీగా పెరిగిపోయింది.

వెంకటేష్ ఇప్పటికే తన తదుపరి 5 సినిమాలను ఫిక్స్ చేసుకున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన వివరాలను ఆయన తాజాగా వెల్లడించాడు. తాజాగా విక్టరీ వెంకటేష్ NATS కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ మాట్లాడుతూ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాలో అతిధి పాత్రలో నటిస్తాను. ఇక మళ్లీ మీనా తో కలిసి దృశ్యం సినిమాలో నటించబోతున్నాను. అలాగే అనిల్ రావిపూడి తో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కి సీక్వెల్ చేయబోతున్నాను.

అలాగే నా స్నేహితుడు బాలయ్య తో బిగ్గెస్ట్ ఫిలిం ఉంటుంది అని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. ఇలా వెంకటేష్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సంక్రాంతి కి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఐదు మూవీలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా  విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: