ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈయన కెరియర్ ప్రారంభంలో జెంటిల్మెన్ మూవీతో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీలో అర్జున్ హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగులో ఏ ఏం రత్నం విడుదల చేశాడు. తెలుగులో ఈ సినిమా విడుదల కావడానికి పెద్ద స్టోరీ జరిగినట్లు ఆయన అందుకు గల పూర్తి వివరాలను తాజాగా తెలియజేశారు. తాజాగా ఏం రత్నం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... జెంటిల్మెన్ సినిమా తెలుగులో విడుదల కావడానికి చాలా పెద్ద స్టోరీ జరిగింది. జెంటిల్మెన్ మూవీ మొదట తమిళ్లో విడుదల అయింది. ఆ సినిమా విడుదల అయిన సమయానికి నేను వేరే దేశంలో ఉన్నాను. నేను తిరిగి ఇండియాకు వచ్చే సరికి ఆ సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇక ఆ మూవీ డబ్బింగ్ హక్కులకు దాదాపు కోటి రూపాయలు చెబుతున్నట్లు నాకు తెలిసింది. కానీ ఆ సమయంలో ఓ డబ్బింగ్ సినిమాకు 35 లక్షల రేటు చాలా పెద్దది. ఇకపోతే జెంటిల్మెన్ సినిమా సూపర్ గా ఉంది అని అలా చాలా మంది చెబుతూ ఉండడంతో నేను ఆ మూవీ ని చూశాను. ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. దానితో నేను జెంటిల్మెన్ మూవీ నిర్మాత దగ్గరికి వెళ్లి సార్ డబ్బింగ్ రైట్స్ ఎంతకు అమ్మాలి అనుకుంటున్నారు అని అడిగాను. దానితో ఆయన కోటి రూపాయలు అని చెప్పాడు. నేను దాదాపు 60 లక్షల రూపాయలు ఆయనకు ఆఫర్ చేశాను. దానితో ఆయన రెండు రోజులు టైం అడిగారు. చివరకు 76 లక్షలకి ఆ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను నేను కొనుగోలు చేశాను. దానితో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. అంత పెద్ద మొత్తంతో కొనుగోలు చేశావు. నీ పని కతం అన్నారు. కానీ నేను మాత్రం ఆ సినిమాను నమ్మాను. ఆ తర్వాత ఆ సినిమాను డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెట్ తెలుగు  మూవీలా అనేక మార్పులు , చేర్పులు చేసి విడుదల చేశాను. అది మంచి విజయం అందుకుంది అని ఏ ఏం రత్నం తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: