సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది వస్తుంటారు ... పోతుంటారు. కానీ కొంత మంది మాత్రమే అద్భుతమైన నటనతో ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకొని ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉంటారు. ఇక అలాంటి వారు చనిపోయిన కూడా ప్రేక్షకులు వారిని ఎంత కాలమైనా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి నటులు ఎంతో మంది మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఉన్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కోటా శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాల క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగించారు. కోటా శ్రీనివాసరావు ఏదో ఒక్క పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వ్యక్తి కాదు. సీరియస్ విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే కమెడియన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను నవ్వించిన సందర్భాలు ఉన్నాయి.

అలాగే సీరియస్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే కోటా శ్రీనివాసరావు ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కోటా శ్రీనివాసరావు , బాబు మోహన్ కాంబినేషన్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మామగారు సినిమాలో వీరి మధ్య వచ్చిన సన్నివేశాలు అద్భుతం. ఇప్పటికి కూడా ఆ సినిమాలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే హలో బ్రదర్ సినిమాలో కోటా శ్రీనివాసరావు ,  మల్లికార్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇక కోట శ్రీనివాసరావు తన నటనతో ఇప్పటివరకు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ఇంత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన నిన్న ఉదయం మరణించారు. ఈయన మరణించడంతో అనేక మంది సినీ ,  రాజకీయ ప్రముఖులు ఈయనకు నివాళులు అర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: