
ప్రెసెంట్ మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్ ని డబల్ చేసుకోబోతున్నాడు రాజమౌళి అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా "అడ్వెంచర్ జోనర్ లో" తెరకెక్కబోతుంది అంటూ తెలుస్తుంది . ఇండియానా జోన్స్ లాంటి సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాసినట్లుగా కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే తెలియజేశారు . అయితే ఈ సినిమా మొత్తం కూడా ఆఫ్రికా అడవుల్లో సాగిపోతుందట. ఒక నిధి కోసం వేట సాగించే హీరో ఫైనల్ గా దాన్ని దక్కించుకున్నాడా..? లేదా..? అనే ఒక పాయింట్ తో సినిమా మొత్తం తెరకెక్కిస్తున్నారట . ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కబోతుందట.
ఇది ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట రాజమౌళి . కాగా ఈ సినిమాలో సాంగ్స్ కి పెద్ద స్కోప్ ఉండదు అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఐటమ్ సాంగ్ ఈ సినిమాలో టోటల్ గా లేపేసారట. రాజమౌళి సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే మంచి కిక్ ఇస్తుంది. బాహుబలి సినిమాలో "మనోహరి" సాంగ్ ఎంత హైలెట్ అయిందో అందరికీ తెలుసు . అయితే ఈ సినిమాలో మాత్రం ఐటెం సాంగ్ లేకుండానే సినిమా మొత్తం కూడా కంప్లీట్ చేసేయాలి అంటూ రాజమౌళి ఫిక్స్ అయిపోయారట .
రాజమౌళి ఒకసారి ఫిక్స్ అయితే ఆయన మాట ఆయనే వినడు. సో ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ లేనట్టే అంటూ ఓ క్లారిటీ వచ్చేసింది . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు . రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో వచ్చే సినిమాలో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకపోతే ఎలా..? అంటూ మాట్లాడుకుంటున్నారు . కొంతమంది రాజమౌళి మహేష్ బాబు కి మంచి నాటి హిట్ ఇస్తాడు అనుకుంటే ఇలా చేసాడు ఏంటి..?? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు . కధ మొత్తం అడ్డం తిరిగిపోయినట్లే రాజమౌళి - మహేష్ బాబు సినిమా మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీ అనమాట అంటూ మాట్లాడుకుంటున్నారు..!