
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కింగ్డమ్’ ఈ గురువారం థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత వారం భారీ అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు బాక్సాఫీస్ హిట్ల వేట విజయ్ దేవరకొండ సినిమాతో వస్తుందా ? అన్న దృష్టి ఈ సినిమా మీదే పడింది. కింగ్‌డమ్ హిట్ అయితే వరుస ఫ్లాపులతో అల్లాడుతున్న విజయ్‌కు ఇది మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. ఈ సినిమా రాబోయే రెండు వారాలు కలెక్షన్లు కుమ్ముకోవచ్చు. ఆగస్ట్ 14న రెండు భారీ సినిమాలైన రజినీకాంత్ 'కూలీ', హృతిక్ రోషన్ - ఎన్టీఆర్‌ల 'వార్ 2' ఒకేసారి థియేటర్లలోకి రానున్నాయి. దీంతో అప్పటి నుంచి ప్రేక్షకులు ఆ సినిమాల వైపు వెళ్లిపోతారు. అప్పటి వరకు కింగ్‌డమ్‌కు మంచి అవకాశం ఉంది.
కింగ్‌డమ్ బిజినెస్ విషయానికి వస్తే, ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ. 55 కోట్ల షేర్ వచ్చేలా చూస్తేనే ప్రొఫిట్ జోన్‌కు వెళ్లగలదు. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఏరియా వైజ్ బిజినెస్ ఇలా ఉంది..
నైజాం – 15 కోట్లు
సీడెడ్ – 6 కోట్లు
ఆంధ్ర – 15 కోట్లు
--------------------------------------------------
కర్ణాటక, ఇతర రాష్ట్రాలు – రు. 3.5 కోట్లు
ఓవర్సీస్ – 10 కోట్లు
ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు – 4 కోట్లు
ఈ ఫిగర్స్ బట్టి చూస్తే, కింగ్‌డమ్‌కు బ్రేక్ ఈవెన్ కావాలంటే బ్లాక్‌బస్టర్ టాక్ రావడం తప్పనిసరి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు