రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ . కొంతమంది వన్ అండ్ ఓన్లీ స్టార్ట్ డైరెక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు . రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . ఆయన టైమింగ్ .. ఆయన రైమింగ్.. ఆయన కథలు.. ఆయన కంటెంట్ వేరే లెవెల్ . ఇప్పటివరకు రాజమౌళిని ఢీకొట్టే రేంజ్ లో కథలను తెరకెక్కించే  డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా జనాలకి కనిపించలేదు . ఈ విధంగానే ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు.  ఆయన ఏ హీరోతో  సినిమా తెరకెక్కిస్తే  ఆ సినిమా సూపర్ డూపర్ హిట్  అని చెప్పుకోవడంలో సందేహం లేదు.
 

ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్లాక్ బస్టర్ . ఇప్పుడు మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్గా మహేష్ బాబును చూపించబోతున్నారు.  దీనికోసం ఏ ఐ టెక్నాలజీని కూడా వాడుకోబోతున్నారు . అంతేకాదు ఈ సినిమాలో దాదాపు పది మంది స్టార్స్ ని గెస్ట్ రోల్ లో చూపించబోతున్నారు అంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది . అయితే సినిమాలపరంగా  రాజమౌళి పై పడే ఏకైక నింద షూటింగ్ ఆలస్యం చేస్తూ ఉంటాడు . షూటింగ్ టైం చెప్పినదానికంటే ఎక్కువ టైం తీసుకుంటారు .



ఇది ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్క స్టార్ చెప్తూనే ఉంటారు . రీసెంట్ గా మహేష్ బాబుతో సైతం అలాంటి నిందలు వేయించుకుంటున్నారు . మహేష్ బాబు లుక్స్ కోసమే సంవత్సర కాలం పాటు టైం వేస్ట్ చేసిన రాజమౌళి ఇప్పుడు తీసిన సీన్  మళ్లీ మళ్లీ తీస్తున్నారట. ఆ సీన్ బాగా రావట్లేదు ఈ సీన్ బాగా రావట్లేదు అంటూ తీసిన సీని 10 సార్లు పైగా రీ షూట్ చేస్తున్నారట.  దీంతో టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది అంటూ  మహేష్ బాబు బాధపడిపోతున్నారట.  మహేష్ బాబుకి సినిమా మరింత ఆలస్యం అవుతుందేమో అన్న భయం కూడా పట్టుకునింది అంటూ టాక్ వినిపిస్తుంది . రాజమౌళిని చాలా మంది దీని కారణంగా ట్రోల్ చేస్తారు . అయినా సరే ఎందుకు రాజమౌళి పదే పదే ఇదే తప్పు చేస్తారో అర్థం కావడం లేదు అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: