
'కింగ్ డమ్' సీక్వెల్ కోసం దర్శక నిర్మాతలు ఓ బడా స్టార్‌ను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ పాత్ర కథాగమనంలో అత్యంత కీలకం కానుందని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ నడిచింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. విజయ్ దేవరకొండతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపిస్తే ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే, 'కింగ్ డమ్' సీక్వెల్ సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయం అని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ స్వయంగా గౌతమ్ తినన్నూరి ఇస్తారని విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. అయితే ఆ అప్ డేట్ కోసం అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కింగ్ డమ్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 100 కోట్ల రూపాయలకు అటుఇటుగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. కింగ్ డమ్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సి ఉంది.