
స్టోరీ విషయానికి వస్తే..
మర్లూర్ అనే గ్రామంలో అశోక్ (జేపీ.తుమినాడు) కి సులోచన అనే దెయ్యం పడుతుంది. దీనిని ఆ గ్రామ ప్రజలందరూ కూడా నమ్ముతారు. అలా ఆ గ్రామం అంతా కూడా దెయ్యం భయంలోనే బ్రతుకుతూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడేయడానికి రంగంలోకి రవన్న (శనిల్ గౌతమ్) ఎంట్రీ ఇస్తారు. ఇక అక్కడి నుంచి కథ ఎలా మలుపు తిరుగుతుంది.. వీరికి దగ్గరగా ఉన్న సోమేశ్వర గ్రామానికి ఉన్న సంబంధం ఏంటి? ఆ దెయ్యం వదిలిందా లేదా?. దెయ్యం నుంచి గ్రామస్తులు బయటపడ్డారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమా ట్రైలర్ మొదట సహజత్వాన్ని కనబరిచింది. ఈ చిత్రాన్ని కన్నడ సినిమా లాగా కాకుండా చాలా రియలిస్టిక్ గానే తెరకెక్కించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.
అలాగే ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. రవన్న పాత్రలో శనీల్ గౌతమ్ సూపర్ గా నటించారు. జేపీ.తుమినాడు తన రోల్ అంతగా లేకపోయినప్పటికీ ఉన్నంతలోనే బాగానే చేశారు. వీరితోపాటు మరికొంతమంది నటీనటులు అద్భుతంగా నటించారు.
మైనస్ పాయింట్స్:
కన్నడలో పెద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో గొప్ప కనిపించలేదు. సినిమాలో పెద్ద ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ వంటివి లేకుండా సెట్ చేశారు.
సినిమాలో కామెడీ బాగానే ఉన్న తెలుగు ఆడియస్స్ కు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం కనిపించలేదు. ఇలాంటి విలేజ్ తరహ కామెడీ డ్రామా చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి.
అలాగే ఇందులో హర్రర్ ఎలిమెంట్స్ అంతగా థ్రిల్ కు గురి చేయలేదు. అలాగే అశోక్ రోల్ కూడా ఒక సమయం తర్వాత సైడ్ కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. మొత్తం రవన్నే సినిమా కథను నడిపించేలా ఉంటుంది.
మొత్తం పరంగా చూసుకుంటే.. సు ఫ్రమ్ సో సినిమా ఒకరోటిన్ హర్రర్ కామెడీ చిత్రంగా ఉన్నది. కామెడీ హర్రర్ ఎలిమెంట్స్ తో చెప్పాలనుకునే ప్రయత్నం మరింత బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా తెలుపుతున్నారు. అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్న.. ఏదో మిస్సయిందనే అసంతృప్తి కనిపిస్తోంది.
రేటింగ్:
2.70/5