మనుషులు రోజు వారి జీవితం కొనసాగించే క్రమంలో అనేక పనులకు ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తూ వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తువుల వినియోగాలను చాలా వరకు తగ్గించండి , ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని చాలా వరకు తగ్గించండి అని అనేక ప్రచారాలను చేస్తూ వస్తుంది. కానీ జనాలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని ఏ మాత్రం తగ్గించడం లేదు. ఏదో కొంత శాతం ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గిన కూడా ఎక్కువ శాతం ఇప్పటికీ జనాలు ఏదైనా వస్తువును తీసుకువెళ్లడానికి రోజు వారి జీవితంలో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లను వాడుతూ వస్తున్నారు.

ప్లాస్టిక్ కవర్లు అనేవి ఎంతో ప్రమాదకరమని , వాటి ద్వారా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని , అనేక మంది శాస్త్రవేత్తలు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తూ ఉంటారు. ఇకపోతే ప్లాస్టిక్ కవర్లను ఏదో ఒక చోట డంపింగ్ చేస్తూ ఉంటారు. అలా డంపింగ్ చేసిన కవర్లు క్రమేపి మురికి కాలువల ద్వారా చెరువుల్లోకి , ఆ తర్వాత నదుల్లోకి , ఆ తర్వాత సముద్రాల్లోకి వెళుతున్నాయి. అలా వెళ్లిన వాటిని చాపలు తింటున్నట్లు , చాలా ఎక్కువ శాతం చాపలు ప్లాస్టిక్ కవర్లను తినడం వల్ల వాటికి అనేక వ్యాధులు వస్తున్నట్లు , ఆ వ్యాధులు వ్యాపించిన చాపలను తిరిగి మనుషులు తినడం ద్వారా వారికి కూడా అనేక రకాలైన హెల్త్ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తుంది.

ఇలా మనుషులు ఉపయోగించి పడేసిన కవర్లు ఒక చోటి నుండి ఒక చోటికి ప్రయాణించి తిరిగి నీటిలోకి చేరుకొని ఆ నీటిలోకి చేరుకున్న కవర్లను చాపలు తినడం వల్ల వాటికి కొన్ని వ్యాధులు సోకే ఆ వ్యాధులు సోకిన చాపలను మనుషులు తిని వారు కూడా పలు వ్యాధులకు గురవుతున్నారు అని పలు నివేదికలు చెబుతున్నాయి. దాని ద్వారా కవర్ల వాడకాన్ని తగ్గిస్తే బెటర్ అని కొంత మంది చెబుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: