హిట్స్ కొట్టినా, ఫ్లాప్స్ పడినా, ఇండస్ట్రీలో మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ స్థానంలో దూసుకుపోతున్న ఏకైక తెలుగు హీరోయిన్ శ్రీలీల అని చెప్పుకోక తప్పదు. ప్రస్తుతం ఆమె హిందీలో ఆషికీ 3 సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారన్న రూమర్ కూడా బాగా చక్కర్లు కొట్టింది. అలాగే ఈ సినిమాలోని శ్రీలీల పాత్ర విషయంలో మరో రూమర్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
 

రీసెంట్‌గా విడుదలైన "సైయారా" సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందులో హీరోయిన్ అల్జీమర్ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి సినిమా కథ మలుపు తిరుగుతుంది. అయితే, శ్రీలీల నటిస్తున్న ఆషికీ 3 కథ కూడా దాదాపు అలాగే ఉంటుందన్న రూమర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది. దీనిపై రీసెంట్‌గా శ్రీలీల స్పందిస్తూ .. "సైయారాకి మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. రెండు వేర్వేరు కాన్సెప్ట్‌లతో ఉన్న కథలు. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నా పాత్ర మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ రూమర్లే, నమ్మకండి” అని క్లారిటీ ఇచ్చింది.



అంతేకాదు తెలుగులో శ్రీలీల హీరోయిన్ గా నటించిన  లెటేస్ట్ మూవీ "మాస్ జాతర" . "మాస్ జాతర" సినిమా ఈ నెల 27న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రెండు సినిమా ప్రమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ  వస్తుంది శ్రీలీల, ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి హిట్ అయినా సరే “శ్రీలీల ఇస్ బ్యాక్” అని అనిపించుకోవడం ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో..? ఈ ఆషికీ 3 సినిమా  పై బాలీవుడ్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: