
దీంతో బీజేపీ పార్టీలోకి చేరేలా కస్తూరి ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలను ఇప్పుడు నిజం చేసింది కస్తూరి. కస్తూరి తమిళ్ ,తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలో కూడా నటించింది. తెలుగులో నాగార్జున నటించిన అన్నమయ్య చిత్రంలో కూడా నటించిన ఈమె.. ఆ తర్వాత చిలక్కొట్టుడు, మా ఆయన బంగారం, గాడ్ ఫాదర్, డాన్ శీను, సమంతకమణి తదితర చిత్రాలలో నటించింది. అలాగే బుల్లితెర పైన పలు సీరియల్స్ లలో కూడా నటించింది కస్తూరి. నిరంతరం ఈమె ఏదో ఒక విషయంపై వివాదాస్పదమైన కామెంట్లు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది.
గత ఏడాది నవంబర్ 3న చెన్నైలో హిందూమక్కల్ కచ్చి నిర్వహించినటువంటి సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారాన్ని సృష్టించాయి. తమిళనాడులో నివసిస్తున్న కొంతమంది తెలుగు వాళ్ళు తమను తాము తమిళ్లుగా చెప్పుకుంటున్నారంటు తెలియజేసింది.. అలాగే పూర్వపు రాజుల అంతపురంలో పరిచారకులుగా తెలుగువారు పనిచేసేవారు అంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. ఈ విషయం పైన కస్తూరి పై పలు రకాల సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ అయ్యి కూడా బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అనంతరం బిజెపి పార్టీలో చేరింది.