వార్ 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నెగిటివ్‌గా కామెంట్ చేసిన అంశం VFX ఎఫెక్ట్స్ గురించే. ఈ ఎఫెక్ట్స్ హృతిక్ రోషన్ విషయంలో బాగా వర్కౌట్ అయ్యాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అంతగా వర్కౌట్ కాలేదని టాక్. అయితే ఇప్పుడు ఈ వార్ 2 సినిమా ప్రభావం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాపై పడే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో దాదాపు 40% వరకు VFX షాట్స్ ఉన్నాయని సమాచారం. ఈ ఎఫెక్ట్స్ నాసికరంగా ఉంటే ప్రేక్షకులు అస్సలు ఎంకరేజ్ చేయరని సినీ వర్గాలు అంటున్నాయి.
 

‘హరిహర వీరమల్ల’ సినిమాకు ఎఫెక్ట్స్ ఎంత నెగిటివ్ టాక్ తెచ్చాయో అందరికీ తెలిసిందే. అదే పరిస్థితి ‘విశ్వంభర’కు వస్తే మాత్రం అది మెగాస్టార్‌కు నిజంగానే కొత్త తలనొప్పే అవుతుంది. VFX బాగాలేకపోతే సినిమాకి కచ్చితంగా నెగిటివ్ టాక్ వస్తుంది. కానీ అవి హై క్వాలిటీగా, హైలైట్ చేసే విధంగా ఉంటే మాత్రం సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని అభిమానులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వ్FX మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కానీ అవి నాసిరకంగా ఉంటే స్టార్ హీరోలని కూడా జోకర్లలా చూపించే పరిస్థితి వస్తోంది. అందుకే ‘విశ్వంభర’ చిత్రబృందం హై బడ్జెట్, హై క్వాలిటీ VFX కోసం చాలా కష్టపడుతోందని సమాచారం.



వారి కష్టం ఫలిస్తుందా లేదా అన్నది మాత్రం మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమా పై అందరి స్పెషల్ ఫోకస్ పడుతోంది. కాగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా క్యాధరిన్ ధెరిస్సా నటిస్తుంది అంటూ సమాచారం అందుతుంది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం అంద్రిలోను ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: