
టాలీవుడ్‌లో సీనియర్ హీరోల కెరీర్‌లో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే కల్ట్ క్లాసిక్స్‌గా నిలుస్తాయి. అలాంటి వారిలో కింగ్ నాగార్జున పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన కెరీర్‌లో ఎన్నో హిట్స్ ఉన్నప్పటికీ, “గీతాంజలి” మరియు “శివ” సినిమాలు మాత్రం ఎప్పటికీ చర్చకు వస్తుంటాయి. ఒకటి క్లాస్ క్లాసిక్‌గా నిలిస్తే, మరొకటి మాస్ క్లాసిక్‌గా తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. “గీతాంజలి” దర్శకుడు మణిరత్నం తీసిన ఒక అద్భుతమైన ప్రేమకథా చిత్రం. ఇందులో నాగార్జున – గిరిజ జంట ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మధురమైన సంగీతం, అద్భుతమైన భావోద్వేగం, సహజమైన నటన ఈ సినిమాను ఓ ఎప్పటికీ మరచిపోలేని క్లాసిక్‌గా నిలబెట్టాయి.
మరోవైపు “శివ” మాత్రం కొత్తదనంతో, విప్లవాత్మక శైలితో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెలుగు సినిమా రీతిని పూర్తిగా మార్చేసిన చిత్రం. యాక్షన్, రియలిస్టిక్ స్టైల్, మాస్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాను ఓ సంచలనంగా నిలిపాయి. ఇటీవల నాగార్జున, జగపతిబాబు నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయనను “గీతాంజలి 2 వస్తే బాగుంటుందా? లేక శివ 2 వస్తే బాగుంటుందా?” అని ప్రశ్నించారు. దీనికి నాగ్ తనదైన హాస్యశైలిలో సమాధానం ఇస్తూ, “గీతాంజలిలో హీరో – హీరోయిన్ ఇద్దరూ చనిపోతారు. కాబట్టి దానికి సీక్వెల్ సాధ్యం కాదు. శివ 2 మాత్రమే చేయగలం” అన్నారు. ఈ సమాధానం ఆయనకు ప్రత్యేకమైన టచ్ తో ప్రేక్షకులను అలరించింది. దీంతో అభిమానులు, సినీ వర్గాలు కూడా “శివ 2” ఐడియా నిజంగా వస్తే ఎలా ఉంటుందా?” అని చర్చించుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు