ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, డేటింగ్లు, ముద్దులు, సరసాలు, హగ్గులు చాలా కామన్‌గా వినిపిస్తూనే ఉంటాయి. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్నా ప్రతి ఒక్కరు పిల్లలతో ఆ లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లరు. ఇది అందరికీ తెలిసిందే. కొంతమంది కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది స్టార్స్‌ ఇప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నవారు . మళ్లీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్‌ను ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.


తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది టాప్ సీనియర్ హీరో కుమారుడు, చాలా టాలెంట్ ఉన్న ఈ యువ హీరోకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈయన ఒక టాప్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ ఆ సమయంలో చనువుగా మెలగడంతో ఇలాంటి వార్తలు వినిపించాయి అని అంతా అనుకున్నారు. అయితే లేటెస్ట్‌గా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ ఇద్దరూ గెస్ట్ హౌస్‌లో కూడా కలుస్తున్నారని కోలీవుడ్ మీడియాలో గుసగుసలాడుతుంది.



డబ్బు, పలుకుబడి, పాపులారిటీ విషయంలో ఏమాత్రం తగ్గని ఈ స్టార్ సీనియర్ హీరో కుమారుడు ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకోవడం వలన నిజంగానే ఆ హీరోకి పరువు పోతుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం "ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ అమ్మాయిలను మోసం చేయడం మాత్రం తప్పు. ఇండస్ట్రీలో చాలామంది అలాంటి తప్పు చేశారు. నువ్వయినా మంచిగా పెళ్లి చేసుకుంటే నీ నాన్న పరువును కాపాడూ" అని రకరకాల కామెంట్స్‌తో సోషల్ మీడియాలో ఈ హీరో పేరును మారు మ్రోగిపోయేలా చేస్తున్నారు. అయితే ఆ హీరో తండ్రి అయిన స్టార్ కూడా గతంలో కొంత మంది హీరోయిన్స్ తో ఇలాంటి ఎఫైర్ వార్తలు వినిపించాయి. కానీ ఆయన తన పేరంట్స్ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. అలాంటి హీరో కొడుకు కూడా ఇలాంటి తప్పే చేస్తుండటం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: