సినిమా ఇండస్ట్రీలో చిన్న ఇష్యూ జరిగినా, చిన్న తప్పు జరిగినా వెంటనే స్టార్ సెలబ్రిటీలు అందరూ ఒకచోట చేరిపోతారు. ఏ హీరో విషయంలో తప్పు జరిగిందో, ఆ హీరోకి సపోర్ట్ చేస్తూ, హైలైట్ చేస్తూ ఉంటారు. "పుష్ప2" సినిమా విషయంలో బన్నీకి ఎంతలా సపోర్ట్ చేశారో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సంధ్య థియేటర్‌లో జరుగుతున్న సమయంలో తొక్కిసలాట జరిగి, అక్కడ ఒక మహిళ మృతి చెందింది. ఆ కారణంగా అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి, ఒక రాత్రి జైలులో ఉంచారు. ఒక్క రాత్రి జైలులో ఉండి వచ్చిన బన్నీని పరామర్శించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. చిన్న హీరో, పెద్ద హీరో, స్టార్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ల పిల్లలు అందరూ అల్లు కాంపౌండ్‌ వద్దకు చేరుకుని పరామర్శించారు.


అంతవరకు బాగానే ఉంది. అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటిగా ఉందని చెప్పడానికి ఈ విధంగా చేశారు అనుకుందాం. అయితే, ఎన్టీఆర్ విషయంలో ఎందుకు అలా చేయలేకపోతున్నారు? ఎన్టీఆర్‌ను ఈ మధ్యకాలంలో ఎలా ట్రోల్ చేస్తున్నారు, ఎలా టార్గెట్ చేస్తున్నారు అన్నది అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడు, టిడిపి ఎమ్మెల్యే, ఎన్టీఆర్‌పై పచ్చి బూతులు తిట్టారు. దానికి సంబంధించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ విషయం చూసి ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. కానీ తారక్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వారు, తారక్ మావాడు అని చెప్పుకునే వారు — ఒక్కరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు.



సోషల్ మీడియా వేదికగా "మా సపోర్ట్ తారక్‌కి ఉంది" అని ఒక్కరూ పోస్ట్ పెట్టలేదు. "తారక్‌ని అలా అనకూడదు" అంటూ ఇండస్ట్రీ పెద్దలమని చెప్పుకునే వారు ఒక్కరూ స్పందించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. "బన్నీ విషయంలో అంతా ఒక్కటిగా నిలిచిన ఇండస్ట్రీ, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎందుకు అలా నిలవలేకపోతుంది?" అంటూ ఫైర్ అవుతున్నారు. కావాలనే తారక్ ని  తొక్కడానికి కొంతమంది స్టార్స్, పొలిటిషియన్లతో  చేతులు కలిపారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఇష్యూ మరోసారి హైలైట్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: