ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా, మెగాస్టార్ చిరంజీవి అన్న పేరు వినగానే ఫ్యాన్స్ కళ్లలో వచ్చే ఆనందం.. వాళ్లు అరిచే అరుపులు, కేకలు .. మరి ఏ హీరో పేరు చెప్పినప్పుడు రావు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అలాంటి క్రేజీ స్థానం సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సాధారణ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన, తన టాలెంట్‌తో, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి మెగాస్టార్‌గా మారాడు. ఆయన పేరు విని నలుగురు ఇండస్ట్రీలోకి రావడానికి ప్రేరణ పొందారు అంటే, ఆయనలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి పేరు చెప్పుకుని కొందరు బయట నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాగే ఆయన ఇంటి నుంచి కూడా చాలామంది హీరోలు వచ్చి సత్తా చాటారు.
 

ముఖ్యంగా మెగా హీరోస్ – సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు అర్జున్, నాగబాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ .. ఇలా మెగా ఫ్యామిలీని నమ్ముకుని ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ చిరంజీవికి ఉన్న ఆ క్వాలిటీ మాత్రం ఎవరికీ రాకపోవడం గమనించదగ్గ విషయం. చిరంజీవి తన సినిమా కథను ఎంచుకోవడంలో చాలా కరెక్ట్‌గా ముందుకు వెళుతాడు. ఎవరైనా డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చి, ఆ కథలో లోపాలు ఉన్నా కూడా ఆయన తెలివిగా సూచనలు చేసి, “ఇలా మార్చండి” అని చెబుతాడు. కానీ ఈ కాలం మెగా హీరోలు మాత్రం, స్క్రిప్ట్ నచ్చకపోతే, “ఈ సినిమా మాకు ఇష్టం లేదు, మా బాడీకి సూట్ కాదులే” అంటూ వదిలేస్తున్నారు. అలా వదిలేసిన మంచి కాన్సెప్ట్స్ తర్వాత పెద్ద హిట్స్ అయ్యాయి.



కానీ చిరంజీవి మాత్రం తన వద్దకు వచ్చిన కథను ఎప్పుడూ మిస్ చేసుకోడు. కథలో లోపాలు ఉన్నా, సర్దుబాటు చేయలేని పరిస్థితులు ఉన్నా, తన మాటలతో డైరెక్టర్‌ను ఒప్పించి, ఆ కథను తనకనుగుణంగా మార్చేసి చేస్తాడు. అంత టాలెంట్ ఉన్న నటుడు చిరంజీవి. ఈ రోజు ఆయన పుట్టినరోజు . ఈ సందర్భంగా మెగా అభిమానులు ఆయన గురించి మరిన్ని విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకి సోషల్ మీడియా వేదికగా బర్త డే విషెస్ అందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: