సినిమా ఇండస్ట్రీలో ఎదుగుదలలు, పతనాలు చాలా కామన్‌. స్టార్‌ హీరోలు, హీరోయిన్స్ ఒక దశలో మెరిసిపోయి తరువాత కనుమరుగైపోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. అలా ఓ సమయంలో పూర్తిగా కనుమరుగైపోయి తిరిగి గ్లామరస్‌ ఎంట్రీ ఇచ్చిన వారిలో బాలీవుడ్‌ యాక్టర్‌ బాబీ డియోల్‌ కూడా ఒకరు. బాబీ డియోల్‌ 90లలోనే బాలీవుడ్‌లో హీరోగా బాగానే వెలుగొందాడు. కానీ తర్వాత ఆఫర్లు తగ్గిపోవడంతో ఆయన కెరీర్‌ డౌన్‌ఫాల్‌లోకి వెళ్లిపోయింది. ఒకానొక దశలో ఆయన పని అయిపోయిందనే కామెంట్స్‌ ఇండస్ట్రీలో వినిపించాయి. సినిమాలు రావడం లేదు, ఆఫర్లు దొరకడం లేదు, దాంతో బాబీ కెరీర్‌ ఎక్కడో ఆగిపోయింది. కానీ తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఎప్పటికైనా మళ్లీ వస్తానని బాబీ నమ్మకంగా కష్టపడ్డాడు.


ఆ సమయం లోనే ఆయనకు యానిమల్‌ అనే పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ సినిమా లైఫ్‌ మార్చేసింది. రణబీర్‌ కపూర్‌తో కలిసి నటించిన ఈ సినిమాలో బాబీ చేసిన విలన్‌ పాత్ర అతనికి విపరీతమైన క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఫేడవుట్‌ అవుతున్నాడని కామెంట్లు వచ్చిన బాబీ డియోల్‌ ఇప్పుడు ఏకంగా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌గా మారిపోయాడు. తెలుగులో కూడా బాబీ డియోల్‌ క్రేజ్‌ బాగానే పెరిగింది. డాకు మహారాజ్‌, హరి హర వీరమల్లు వంటి భారీ చిత్రాల్లో ఆయన పాత్రలు బలమైన ఇంపాక్ట్‌ చూపించాయి. విలన్‌గా మాత్రమే కాదు, హీరోగా కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.



ఇకపోతే బాబీ డియోల్‌ లైనప్‌ చూస్తే ఆయన ఎంత బిజీగా ఉన్నాడో అర్థమవుతుంది. బాలీవుడ్‌, సౌత్‌ ఇండస్ట్రీల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్‌లలో కూడా ఆయన దూసుకుపోతున్నారు. షారుఖ్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో రాబోయే వెబ్‌ సిరీస్‌లో కూడా ఆయన కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పుడు మూడు సంవత్సరాల పాటు కూడా సినిమా లేకపోయిన బాబీ డియోల్‌, ఇప్పుడు ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయిలో ఉన్నాడు. రోజుకు లక్షల పారితోషికం తీసుకునే స్టార్‌గా ఎదిగాడు. కష్టకాలం నుంచి లగ్జరీ లైఫ్‌ వరకు ఆయన జర్నీ నిజంగా ప్రేరణాత్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: