
ఇప్పటికే హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం, సినిమా పూజా కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నారు అన్నదాన్ని ప్రత్యేక వీడియోగా చూపించడం వంటివి ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి రేపాయి. ఒక్కో అప్డేట్‌ను సెన్సేషన్‌గా మార్చే విధంగా ఆయన టీమ్ ప్లాన్ చేస్తోంది. ఫలితంగా సినిమా షూటింగ్ మొదలు కాకముందే సోషల్ మీడియాలో బజ్ అమాంతం పెరిగింది. అభిమానులు, సినీ విశ్లేషకులు చెబుతున్న ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే – అనిల్ రావిపూడి ఈ సినిమాను కేవలం ఒక ప్రాజెక్ట్‌గా కాకుండా, ఒక ప్రెస్టీజ్ ఇష్యూలా తీసుకున్నాడు. ఎందుకంటే చిరంజీవి లాంటి మెగాస్టార్‌తో సినిమా చేయడం అంటే అదో పెద్ద గౌరవం. దానిని హిట్ చేయడం, బాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం అనిల్ రావిపూడి కెరీర్‌కే కాదు, ఆయన భవిష్యత్తుకూ కీలకం అవుతుంది. అందుకే మొదటి రోజు నుంచే పక్కా ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్తున్నాడు.
ఇక ఇంకో హాట్ టాపిక్ ఏమిటంటే .. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల సినిమాల విషయంలో వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అదే స్ట్రాటజీని అనిల్ రావిపూడి కూడా ఫాలో అవుతాడని ఊహిస్తున్నారు. అలా అయితే చిరంజీవితో పాటు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ లాంటి మెగా హీరోలు కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్‌పై ఎక్కువ ప్రెజర్ పడే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. "చిరంజీవి అనుకున్నంత ఈజీగా అనిల్ రావిపూడి సినిమా ఉండదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం "అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది" అని నమ్ముతున్నారు. మొత్తం మీద ‘మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబో’ ప్రాజెక్ట్ రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో షూస్ బజ్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.