ఏంటి కాజల్ అగర్వాల్ కి ఆ హీరో తో విభేదాలు నిజమేనా.. సమంత కూడా సపోర్ట్ చేసిందా..ఇంతకీ ఎలాంటి వివాదాలు లేని కాజల్ అగర్వాల్ కి ఏ హీరోతో విభేదాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్ ని ఎంతో బాగా ప్లాన్ చేసుకొని ఇండస్ట్రీలో కొనసాగింది.సినిమాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా తన క్రేజ్ తగ్గకుండా వరుస సినిమాలు చేస్తుంది.అయితే పెళ్ళై బాబు పుట్టాక కూడా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కాస్త స్లో అయిపోయింది అని చెప్పుకోవచ్చు. గత ఏడాది కాజల్ నటించిన భారతీయుడు 2 మూవీ విడుదలైనప్పటికీ ఈ సినిమాలో కాజల్ పాత్రకి అంతా స్కోప్ అయితే లేదు. ఇదంతా పక్కన పెడితే గతంలో కాజల్ కి ఓ హీరోతో విభేదాలు వచ్చాయని, అందుకే మూడు వారాలు షూటింగ్ చేశాక ఆమెను అందులో నుండి తీసేసారు అంటూ రూమర్లు వినిపించాయి.

 ఇక ఆ హీరో ఎవరయ్యా అంటే మహేష్ బాబు..అదేంటి మహేష్ బాబు కాజల్ అగర్వాల్ కాంబోలో బిజినెస్ మాన్,బ్రహ్మోత్సవం వంటి సినిమాలు వచ్చాయి. వీరికి విభేదాలు ఎక్కడున్నాయి అని మీరు అనుకోవచ్చు. అయితే సుకుమార్ డైరెక్షన్లో మహేష్ బాబు కృతి సనన్ హీరో హీరోయిన్లుగా చేసిన వన్ నేనొక్కడినే మూవీలో మొదట హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నారట. కాజల్ ని తీసుకొని కొద్దిపాటి షూటింగ్ జరిపాక కాజల్ డేట్స్ కుదరక అందులో నుండి తప్పుకుందట. కానీ ఆ సమయంలో మహేష్ బాబుకి కాజల్ కి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు రూమర్లు వినిపించాయి. ఆ తర్వాత కృతి సనన్ ని తీసుకున్నారు.ఇక కృతి సనన్, మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ వెంటపడి కృతి సనన్ ఓ పాటలో నటిస్తుంది.

హల్లో రాక్ స్టార్ ఐ యాం యువర్ ఏంజెల్ అనే  పాటలో హీరో చుట్టూ హీరోయిన్ తిరిగే పోస్టర్ ని చిత్రయూనిట్ రిలీజ్ చేసిన సమయంలో సమంతపోస్టర్ పై మండిపడింది.ఈ పోస్టర్ సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యతను తెలుపుతుంది అని చెప్పింది.దాంతో మహేష్ బాబు తో సమంతకు గొడవలు ఉన్నాయనే రూమర్లు వినిపించాయి. సమంత,కాజల్ ఇద్దరితో మహేష్ బాబుకు విభేదాలు వచ్చినట్లు రూమర్లు వినిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా మహేష్ తో కలిసి నటించారు. దాంతో కాజల్,సమంతకు మహేష్ తో ఎలాంటి విభేదాలు లేవని కాజల్ తనకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా నుండి తప్పకుందని,అలాగే సమంత పోస్టర్ పై తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేసిందని,వ్యక్తిగతంగా మహేష్ బాబుతో ఎలాంటి గొడవ లేదని క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: