బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న కాజోల్ అగర్వాల్ ఎప్పుడూ తన స్టైల్, అందం, నటనతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా ఆమె నటించిన సినిమా “మా”. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కి జూన్ 27న విడుదలై మంచి పాజిటివ్ టాక్ సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగిస్తూ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటు కాజోల్ ప్రస్తుతం “ది ట్రయల్ 2” అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె న్యూయానిక సేన గుప్తా పాత్రలో కనిపించబోతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ బిజీగా గడుపుతోంది.


అయితే తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కాజల్ వేసుకున్న డ్రెస్‌నే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా చర్చిస్తున్నారు. బ్లాక్ కలర్ షర్ట్ డ్రెస్ ధరించి ఈ ఈవెంట్‌కి హాజరైన కాజల్ అందరినీ ఆకట్టుకుంది. ఆ డ్రెస్ కాస్త టైట్‌గా ఉండడంతో ఆమె బాడీ షేప్ క్లియర్‌గా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవ్వగా, కొంతమంది కుర్రాళ్లు ఆ వీడియోని తెగ జూమ్ చేసి చూస్తూ, ముఖ్యంగా ఆమె ఎద భాగాలపై ఫోకస్ చేస్తూ ఘాటు కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఇంతటితో ఆగకుండా కాజల్ ఫోటోలు, వీడియోలను తీసుకుని జూమ్ చేసి మరీ బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విషయం కొందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా నటి మినీ మాధుర్ దీనిపై ఘాటుగా స్పందించింది.



“ఒక హీరోయిన్ ఎలా కనిపించాలి అనేది ఆమె ఇష్టం. ఆమె శరీరాన్ని జూమ్ చేసి మరీ కామెంట్లు చేయడం ఎంత వరకు కరెక్ట్..? మీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు..? మీకెందుకు ఇంత ధైర్యం వచ్చింది..?” అంటూ నెట్టిజన్లపై ఘాటుగా ఫైర్ అయింది. అయితే నెట్టిజన్లలో కొందరు మినీ మాధుర్ మాటలకు కౌంటర్ ఇస్తూ, “అది కాజోల్‌కి ఇబ్బందిగా ఉంటే ఆమె మాట్లాడాలి. నీకు ఎందుకు బాధ..?” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ కౌంటర్-అటాక్ వల్ల సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య చర్చలు బాగా వేడెక్కాయి. ప్రస్తుతం ఈ వీడియోపై వచ్చిన కామెంట్స్, మినీ మాధుర్ రియాక్షన్ అన్నీ కలిసి నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. కానీ కుర్రాళ్లు మాత్రం తమదైన స్టైల్‌లో కాజోల్ అందాలను ఆస్వాదిస్తూ, జూమ్ చేసి మరీ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: