సాధారణంగా స్టార్ హీరో అయ్యాక చాలా మంది ఇంట్లో పెద్దలు చెప్పిన మాట వినడం మానేస్తారు. ఇది కేవలం సినిమా స్టార్స్‌కి మాత్రమే కాదు, డబ్బు ఉన్న ఇళ్ళ పిల్లల్లో కూడా కనిపించే విషయమే. ఒక వయస్సు వచ్చిన తర్వాత, తమకిష్టం వచ్చినట్టే ముందుకు వెళ్తారు. పెద్దలు ఏం చెప్పారు? ఎందుకు చెప్పారు? అని ఒక్కసారి కూడా ఆలోచించరు. ఈ తరహా వ్యక్తుల్లో ఎక్కువమంది "నాకు నచ్చిందే చేయాలి" అన్న అహంభావంతో నడుచుకుంటుంటారు.న్కానీ అలాంటి వారిలోనూ ఒక అపూర్వమైన ఆణిముత్యం లాంటి వ్యక్తి మన డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్. వయస్సు పెరిగినా, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, వేల కోట్ల ఆస్తికి అధిపతి అయినా, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా… ప్రభాస్ మాత్రం ఇంట్లో పెద్దలు చెప్పిన మాటకే విలువ ఇస్తాడు. వాళ్లు చెప్పిన దారిలోనే నడుస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత, ఇదే ఆయన గ్రేట్‌నెస్.


అసలు ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆరడుగుల అందగాడు ఒకసారి స్క్రీన్‌పై కనబడితేనే "డ్యూడ్.. ఇది నిజంగానే రియల్ హీరో!" అనిపించేస్తాడు. అంతటి స్టార్ అయినా, ఆయనలో ఉండే డిసిప్లిన్, పెద్దల పట్ల గౌరవం నిజంగా అనుసరించదగినవి. ప్రభాస్ కి మొదట్లో టాటూ వేయించుకోవాలన్న కోరిక బాగా ఉండేదట. అప్పట్లో అది ఒక ట్రెండ్ కూడా. చాలామంది స్టార్స్ టాటూలు వేయించుకోవడం స్టైల్ స్టేట్‌మెంట్ లాగా చేసుకున్నారు. ప్రభాస్ కూడా తనకి నచ్చిన ఒక టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆయనకు ఎంతో సన్నిహితమైన పెద్దలు అయిన కృష్ణంరాజు గారికి ఈ విషయం అస్సలు నచ్చలేదు.



కృష్ణంరాజు అభిప్రాయం ప్రకారం, ఇలాంటి పనులు అవసరం లేవు. మనం చేసే ప్రతి పని కూడా ఒక అర్థం ఉన్నట్టుగా ఉండాలి అన్నది ఆయన నమ్మకం. ఆయనకి ఇష్టం లేకపోవడంతో ప్రభాస్ వెంటనే తన నిర్ణయం మార్చుకున్నాడు. "నాకు ఇష్టమైనా సరే, నా పెద్దలకు నచ్చకపోతే చేయను" అని నిర్ణయించుకుని, తన టాటూ వేసుకోవాలన్న కోరికని పూర్తిగా వదిలేశాడు. "ఆ ఛాప్టర్ నా లైఫ్‌లో డిలీట్ చేశాను" అని ఆయన తర్వాత సరదాగా చెప్పుకున్నాడట. ఇది విని అభిమానులు నిజంగానే ప్రభాస్‌కి ఫిదా అయిపోయారు. ఎందుకంటే ఈ రోజుల్లో చేతిలో 10,000 రూపాయలు ఉంటేనే తల్లిదండ్రుల మాట వినకుండా ఎదిరించే పరిస్థితులు చూస్తున్నాం. అలాంటి సమయంలో వేల కోట్ల ఆస్తి.. ఇమేజ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ కలిగిన హీరో అయిన ప్రభాస్ మాత్రం… తన పెద్దలకి గౌరవం ఇచ్చి, వాళ్ల ఇష్టం ప్రకారమే నడుచుకోవడం నిజంగా గొప్ప విషయం.



అందుకే ప్రభాస్‌ను అభిమానులు "మన డార్లింగ్", "మన రెబల్" అని గర్వంగా పిలుస్తుంటారు. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఈ వినయం, పెద్దల పట్ల గౌరవం, ఫ్యామిలీ వాల్యూస్‌కి ఇచ్చే ప్రాధాన్యం ఇవన్నీ కలిసి ఆయనని ఇతర హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: