
అట్లీతో బన్నీ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాలని ఉన్నా, దానిని కాకుండా అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా బన్నీకి హేటర్స్‌గా మారిపోయి, రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవడంపై ఫ్యాన్స్‌కి డిసప్పాయింట్‌మెంట్ ఎక్కువైంది. బన్నీకి - దీపిక కి అసలు సూట్ కాదని, ఆమెను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా సినిమా ని ఆమె ఎంత రాధ్హాంతం చేసిందో అందరికి తెలుసు. ఇదే టాక్ మళ్లీ వస్తోందని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అయినా కూడా ఎందుకు అట్లీ - బన్నీ కోసం దీపికను ఎంపిక చేశాడని చర్చలు జరుగుతున్నాయి.
ఇవి పక్కన పెడితే, ఇప్పుడు మరొక హాట్ టాపిక్ చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో దీపిక పదుకొనేకి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చింది అట్లీనే, కానీ ఇది బన్నీకి కూడా అంతగా ఇష్టం లేదని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ కూడా దీపిక షూటింగ్‌కు ఆలస్యంగా వస్తోందట. ఈ విషయాన్ని బన్నీ గమనించి అట్లీకి చెప్పినా, అట్లీ పెద్దగా పట్టించుకోవట్లేదని అంటున్నారు. దీపిక కారణంగానే సినిమా షూట్ ఆలస్యమవుతోందట. రోజుకు 10 గంటలు చేయాల్సిన షూటింగ్, ఆమె వల్ల నాలుగు గంటలు కూడా సరిగా జరగలేకపోతున్నాయట. మధ్య మధ్యలో ఫ్రెండ్స్‌తో మీటింగ్స్, ఫోన్ కాల్స్ అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నదట. ఇవన్నీ చూసినా అట్లీ పట్టించుకోవడం లేదని బాలీవుడ్ మీడియా చెబుతుంటే, టాలీవుడ్ మీడియాలో మాత్రం “బన్నీ ఎన్నిసార్లు చెప్పినా అట్లీ వినడం లేదు” అని రిపోర్ట్ చేస్తున్నారు.
దీంతో ఆకతాయిలకు మంచి స్టఫ్ దొరికింది. కావాలని వీటన్నింటినీ ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ఫలితం అటు–ఇటుగా మారితే నష్టపోయేది బన్నీయే అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద అట్లీ ఏ విధంగా స్పందిస్తాడో అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. కొందరు కావాలనే ఈ విషయాన్ని హైప్ చేస్తున్నారని కూడా అంటున్నారు.