
తాజా పి.ఆర్. లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి “కూలీ” తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. ఇది రజినీకాంత్ కెరీర్‌లో రెండోసారి ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా కావడం గమనార్హం. గతంలో వచ్చిన “జైలర్” తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే స్థాయిలో “కూలీ”కి కూడా స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే, ఖచ్చితంగా “జైలర్” రికార్డులను క్రాస్ చేసేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ డివైడ్ టాక్ కారణంగా ఆ స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా రజినీకాంత్ అభిమానుల అండతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే రన్ అవుతోంది.
లోకేష్ కనగరాజ్ స్టైల్లో తెరకెక్కిన యాక్షన్ ఎపిసోడ్స్, రజినీకాంత్ ఎనర్జీ, బ్లాక్‌బస్టర్ రేంజ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి. మొత్తం మీద “కూలీ” రజినీకాంత్ కెరీర్‌లో మరో భారీ హిట్‌గా, ప్రత్యేకంగా తెలుగు మార్కెట్‌లో కూడా మంచి బిజినెస్ సాధించిన సినిమాగా నిలవబోతుంది. ఫైనల్‌గా చెప్పుకోవాల్సిందంటే, డివైడ్ టాక్ ఉన్నప్పటికీ “కూలీ” బాక్సాఫీస్ వద్ద మాస్ హంగామా సృష్టిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు