2014 వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వై సీ పీ పార్టీ అధికారం లోకి వచ్చింది. ఇక కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తుల భాగంగా పోటీ చేశాయి. ఈ పోటీలో కూటమి విజయం సాధించింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నుండి పెద్ద ఎత్తున పరిశ్రమలను తమ రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలను చేస్తున్నారు.

అందులో కొన్ని కంపెనీలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకువచ్చారు. ఇకపోతే తాజాగా మరో కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఈ కంపెనీ ఏకంగా 95 వేల కోట్ల భారీ వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ లో కంపనీ ని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బీబీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఫ్యాక్టరీ 95 వేల కోట్లతో స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ రివైనరీ అంటే చుట్టూ పచ్చని పొలాల మధ్యలో ఆయిల్ ను శుద్ధి చేస్తారు. ఇకపోతే భారీ వ్యాయంతో ఎంతో పెద్దగా ఈ కంపెనీ ని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది.

కానీ ఒక ఫ్యాక్టరీని రూపొందించారు అంటే దాని ద్వారా పెద్ద ఎత్తున వ్యర్ధాలు బయటకు వస్తాయి. అలాగే ఆ చుట్టు పక్కల ప్రాంతం అంతా కలుషితం అవుతుంది. మరి ఇలా ఇంత పెద్ద కంపెనీ ని స్థాపించే విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ని ప్రాంతాలు కలుషితం అవుతాయో ... ఆ కంపెనీ నుండి వచ్చే వ్యర్ధాలను ఎక్కడికి తరలిస్తారో అనే వాదనను కొంతమంది వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: