సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించాడు. మొదటి నుండి కూడా ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 13 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని  కోట్ల కలెక్షన్లను రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్టుగా నిలుస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం.

13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 136.90 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 65 కోట్లు , కర్ణాటకలో 42.70 కోట్లు , కేరళలో 24.65 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 44.85 కోట్లు , ఓవర్సీస్ లో 176.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 13 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 246.90 కోట్ల షేర్ ... 490.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దరికాయి. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 307 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా మరో 60.01 కోట్ల షేర్ కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ 60.01 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హిట్టుగా నిలవడం కాస్త కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: