
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లోని కిసిక్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దానితో ఈ సాంగ్ 24 గంటలు అత్యధిక వ్యూస్ ను సాధించిన తెలుగు సాంగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చెంజర్ మూవీ లోని నా నా హైరానా సాంగ్ 23.44 మిలియన్ వ్యూస్ ను అందుకొని రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇదే సినిమాలోని దోప్ అంటూ సాగే సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 21.27 మిలియన్ వ్యూస్ ను అందుకొని మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లోని అసుర హరణం సాంగ్ 19.93 మిలియన్ వ్యూస్ ను 24 గంటల్లో అందుకునే నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇదే మూవీ లోని మాట వినాలి సాంగ్ 24 గంటల్లో 19.51 మిలియన్ వ్యూస్ ను అందుకొని ఐదవ స్థానంలో కొనసాగుతుంది.