మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్.ఎస్.తమన్ సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నా డీఎన్ఏ ని టెస్ట్ చేయండి అంటూ దుమారం సృష్టించే కామెంట్లు చేశారు. మరి ఎందుకు తమన్ అలాంటి కామెంట్లు చేశారు..ఆయన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా హీరోగా కొనసాగుతున్నందు వల్ల లండన్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు అరుదైన గుర్తింపు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. 

అలా బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కింది.అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు తాజాగా హైదరాబాదులో ఒక ఈవెంట్ ఏర్పాటుచేసి మరీ బాలకృష్ణకి సర్టిఫికెట్ ఇచ్చి సన్మానించారు.ఈ నేపథ్యంలోనే ఎంతోమంది బాలకృష్ణకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అలా రజినీకాంత్ బాలకృష్ణని పొగుడుతూ వీడియో పోస్ట్ చేశారు.అలాగే ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తమన్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. బాలకృష్ణ ని చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది. కొట్టాలంటే మీరు వేరే అర్థం చేసుకోకండి.

 మ్యూజికల్ గా కొత్త కర్రలు, కత్తులు వచ్చేస్తాయి.. అయితే బాలయ్య బాబుని చూసినప్పుడల్లా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కాదు.ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గరకి వెళ్లి ఒకసారి నా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి..అలా చేస్తే నాలోపల ఏం జరుగుతుందో అర్థమవుతుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు తమన్. అలాగే బాలకృష్ణతో చేసే అఖండ-2 మూవీ సరికొత్త రికార్డులు కొడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక బాలకృష్ణ హీరోగా అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: