సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ పొజిషన్‌కి వచ్చాక మనం ఏమి మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మాట్లాడుతున్నామో బాగా ఆలోచించి, ఆచితూచి మాట్లాడాలి. పొరపాటున ఎక్కడైనా సరే ఒక పర్సన్‌కి "థాంక్స్" రిప్లై ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ తప్పదు. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలతో పనిచేసిన డైరెక్టర్ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా, శాంతంగా మాట్లాడాలి. పొరపాటున ఒక హీరోని ప్రస్తావించి మరొక హీరోని ప్రస్తావించకపోతే ఆ రెండో హీరో ఫ్యాన్స్‌కి ఒళ్లు మండిపోతుంది. ఏదైనా చేసేస్తారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిదీ పెద్ద విషయంగా మార్చడం ఎక్కువ అలవాటైపోయింది. తాజాగా అలాంటి ట్రోలింగ్‌కి బలైపోయాడు డైరెక్టర్ ఓం రౌత్. బాలీవుడ్ డైరెక్టర్ అయినా తెలుగు జనాలకు కూడా ఆయన పేరు బాగా తెలిసినదే. ఎందుకంటే ప్రభాస్‌తో ‘ఆది పురుష్’ సినిమాను తెరకెక్కించారు.

త్వరలోనే డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న బిగ్ బడా ప్రాజెక్ట్ "కలం". భారతదేశపు మాజీ రాష్ట్రపతి, మిసైల్ మాన్‌గా ప్రసిద్ధి చెందిన ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించడం సినిమాకి మరింత హైలైట్. ధనుష్ ఎంచుకునే సినిమాలు మంచి కంటెంట్‌తో ఉంటాయని అందరికీ నమ్మకం ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో "కలం" సినిమా మరింత హిట్ అవుతుందన్న నమ్మకం అందరిలో ఉంది. 2025 మేలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేసినా సినిమాపై బోలెడంత హైప్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఓం రౌత్ మాట్లాడుతూ "కలం" బయోపిక్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచేలా వ్యాఖ్యానించారు.

“డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం పాత్ర పోషించడానికి చాలా మందిని వెతికాను, సంప్రదించాను. కానీ ధనుష్ కంటే మంచి నటుడు ఎవరూ కనిపించలేదు. ఆ పాత్రకు ఆయన మాత్రమే సరిపోతారు. ఆయన అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ధనుష్ అద్భుతమైన నటుడు. ఎలాంటి పాత్రలైనా సులభంగా పోషిస్తాడు. నేను నిజంగా పని చేయడానికి ఇష్టపడే నటుడు ఆయన మాత్రమే. కలాం జీవితంలో ఏ భాగాన్ని ఎంచుకుని సినిమా చేయాలనేది పెద్ద సవాలుగా మారింది. కానీ ఈ సినిమాను అందరికీ స్ఫూర్తిదాయకంగా అందిస్తానన్న నమ్మకం నాకుంది,” అని ఓం రౌత్ తెలిపారు.

అయితే ‘ఆది పురుష్’ సినిమాలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసిన ఓం రౌత్ ఇలా ధనుష్‌ను మాత్రమే హైలైట్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. “ప్రభాస్ మంచి నటుడు కాదని చెప్పాలనుకున్నావా? ధనుష్‌తో పాటు మిగతా వారినీ ప్రస్తావించాలి. ధనుష్ మాత్రమే గొప్ప నటుడు అంటే ఎలా?” అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరికొందరు ప్రభాస్ అభిమానులు ఘాటుగా స్పందిస్తూ, “ఆ డైరెక్టర్ ఓం రౌత్ మాటలకు అంత విలువ లేదు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం “ప్రభాస్‌ను అవమానించాడు ఓం రౌత్” అంటూ డైరెక్టర్‌పై సోషల్ మీడియాలో హ్యూజ్  ట్రోలింగ్ జరుగుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: