చాలామంది సెలెబ్రిటీలు అప్పుడప్పుడు  ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. అయితే కొంతమంది పబ్లిక్ ఈవెంట్లలో ఇంకొంతమంది తమ సినిమా ప్రమోషన్స్ టైం లో తమ సినిమా ఈవెంట్లకు సంబంధించి ఏదైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కాస్త అటు ఇటుగా మాట్లాడితే కచ్చితంగా ఆ మాటలు ట్రోల్స్ కి గురవుతాయి. అలా ఇప్పుడు మనం చెప్పుకోయే ఈ సెలబ్రిటీలందరూ స్టేజి మీద మాట్లాడిన మాటల వల్ల ఫూల్స్ అయ్యారు. మరి ఇంతకీ స్టేజ్ మీద మాట్లాడి ఫూల్స్ అయిన ఆ సెలెబ్రెటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెలబ్రెటీస్ కి అందరి ముందు పరువు పోయినంత పని అయింది. 

ముందుగా చూసుకుంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఓ సినిమా ఈవెంట్లో రష్మిక మందన్నా అని పలకపోయి రష్మి ముండకా అని పిలిచి ట్రోల్స్ పాలయ్యారు. ఇలా చిరంజీవి సెలబ్రిటీల పేర్లు మర్చిపోయి చాలాసార్లు ఫూల్ అయ్యారు. అలాగే ఊర్వసి రౌటేలా పేరుని ఊర్వశి రాథోడ్ అని పిలిచి మళ్లీ విమర్శల పాలయ్యారు. అలాగే శ్రీలీల పేరుని కూడా మర్చిపోయి శ్రీలీలి అని మాట్లాడి అందరికీ నవ్వు తెప్పించారు.ఇక పూరి జగన్నాథ్ గురించి చూసుకుంటే..ఆయన టెంపర్ మూవీ ఈవెంట్లో నందమూరి జానకి రామ్ గురించి మౌనం పాటిద్దాం అనబోయి నందమూరి జానకిరామ్ పటాస్ అంటూ మాట్లాడి ఒక వన్ మినిట్ అని ఛ మర్చిపోయానే అని తల పట్టుకున్నారు. 

ఇక మన ప్రభాస్ గురించి చూసుకుంటే.. శర్వానంద్ కి సంబంధించిన ఓ మూవీ ఈవెంట్లో పక్కనే ఉన్న వ్యక్తిని పట్టుకొని మన హీరో శర్వా అంటూ ట్రోల్స్ కి గురయ్యారు. ఎందుకంటే ప్రభాస్ పక్కన ఉన్నది శర్వానంద్ కాదు. మరో వ్యక్తి.ఇక తాను చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి ఏమో ఈయన కూడా ఫ్యూచర్లో హీరో అవుతాడు కావచ్చు అంటూ కవర్ చేసుకున్నాడు. ఇలా ఈ సెలబ్రిటీలందరూ స్టేజ్ మీద మాట్లాడి ట్రోల్స్ కి గురయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: